Posts

నా కల

Image
 కళ్ళు మూయగానే నా కళ్ళ ముందుకొస్తుంది.. కొత్త లోకం లోకి నన్ను తీసుకువెళ్తుంది.. ఇష్టమైన వాటిని చూపించి పరవసింపచేస్తుంది.. కష్టం కలిగించే వాటిని చూపించి బాధపెడుతుంది..                         కొన్ని సార్లు ప్రశాంతతని పరిచయం చేస్తుంది.. కొన్ని సార్లు నా భయాన్ని బయట పెడుతుంది.. ఒక్కోసారి మేలుకోగానే తనని తలచుకునేల చేస్తుంది.. ఒక్కోసారి దరికి రాగానే మెలుకువ తెప్పించేస్తుంది.. నిజమైతే బాగుండును అనిపించేవి కొన్ని చెప్తుంది.. నిజం కాదు అని ఊపిరి పీల్చుకునేలా కొన్ని చెప్తుంది.. తను చూపిన దాన్లో ఎదో అర్ధం వేతకమంటుంది.. తను అర్ధం లేని వ్యర్ధమైన వాటిని చూపించనంటుంది.. తన రాకకు కారణం తెలుసుకోవాలనిపించేలా చేస్తుంది.. తన పుట్టుక ఎక్కడో తప్ప ఎందుకో తెలియనీయకుండా చేస్తుంది.. కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇస్తుంది.. సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతుంది.. నా కలంతో రాయమంటుంది తన గురించి ఇలా.. తనే ‘కల‘….  My dream

తొలి పరిచయం - తొలి వీడ్కోలు.

 కొన్ని నెలలుగా ఎదురుచూపులు, తొలిసారి కలవడం కోసం!! విశ్వం కూడా ఎదురు చూసిందేమో, ఈ సమయం కోసం!! అనుకోకుండానే ఎదురు వచ్చిన సందర్భం, ప్రపంచం కూడా ప్రణాళిక రచించిందేమో… ఇదేనేమో విధి అంటే. మొదటిసారి జరిగేదేగా అద్భుతం అంటే… ఒకే దిశగా పడుతున్న అడుగులు, కొన్ని వేల ఆలోచనలు. వీటన్నిటినీ దాటి, నీ మొదటి స్పర్శ నన్ను తాకుతూనే… నా మనసు మౌనానికి బానిసైంది, రెండు క్షణాలు… నా పెదవులు, పలుకులు మరచిపోయాయి. నీ చెయ్యి పట్టుకుని నడుస్తే… ఏంత దూరమైనా తరిగిపోతుందేమో అన్న ఆలోచన!! అరగంటలో ఇన్ని అద్భుతాలు జరుగుతాయి అని అప్పటి వరకు నాకు తెలియదు. తొలి పరిచయం ఏంత అద్భుతంగా ఉంటుందో… తొలి వీడ్కోలు కూడా అంతే భారంగా ఉంటుంది నా అడుగులు వెనకకు పడే సమయంలో నీ కౌగిలి, ప్రపంచంలో ఇంతకంటే ప్రశాంతమైనది ఏమైనా ఉంటుందా అనే భావన!! వెళ్ళక తప్పదు, దూరాన్ని కూడా తగ్గించే ప్రేమ ముందు, ఆ దూరం కూడా తల దించుకుంటుంది అనే నమ్మకంతో… తొలి వీడ్కోలు.